Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

పెన్షన్ల పంపిణీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటాం

సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ మొదలు కావాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ మొదలు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ గురించి డిఆర్డిఏ పిడి, డిపిఓ, ఆర్డీఓలు, ఎల్డిఎం, బ్యాంక్ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు కోసం అప్రమత్తంగా ఉండాలన్నారు. గత నెలలో పెన్షన్ల పంపిణీలో రాష్ట్రంలో మూడవ స్థానంలో ఉన్నామని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ ధన్యవాదములు తెలిపారు. కానీ ఆరు గంటలకు మొదలు కావాల్సిన పింఛన్ల పంపిణీ కొన్ని ప్రాంతాలలో 9 గంటలకు, మరికొన్ని ప్రాంతాలలో 10 గంటలకు మొదలు కావడం జరిగిందని, కానీ చివరకు వచ్చేసరికి మనం తొందరగా పూర్తి గలిగామని, కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరూ 6 గంటలకే పెన్షన్ పంపిణీ కార్యక్రమం మొదలు పెట్టాలని ఆదేశించారు. నియోజకవర్గ, మండల స్థాయి ప్రత్యేక అధికారులు కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించాలని, పెన్షన్ల పంపిణీ కోసం నియోజకవర్గ, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందన్నారు. సజావుగా పెన్షన్ల పంపిణీ జరిగేలా వారు చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీ కోసం బయోమెట్రిక్ డివైజ్, యాప్ లో ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే వారిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
సెప్టెంబర్ ఒకటో తేదీన మొదటి రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలని సూచించారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగడానికి వీలులేదన్నారు. పెన్షన్ల పంపిణీ అత్యంత జాగ్రత్తగా చేపట్టాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లను అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అలాగే మండల స్పెషల్ అధికారులు ముందు రోజు రాత్రికి మండల కేంద్రాలలో ఉండి పర్యవేక్షించాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిపిఓ ప్రభాకర్ రావు, డిఆర్డిఏ పిడి ఓబులమ్మ, ఆర్డీఓలు, ఎంపీడీవోలు, ఎల్డిఎం, బ్యాంక్ అధికారులు, ఏపీఎంలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img