విశాలాంధ్ర, పామిడి
(అనంతపురం జిల్లా)
పామిడి మండలంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయంలొ, పోలీసు స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, విద్యుత్ కేంద్రంలో ఏఈ, సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ డాక్టర్ శివ కార్తీక్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన అసంఖ్యాక ధైర్యవంతుల కారణంగా ఈ రోజు మనం స్వేచ్ఛగా ఉన్నాము. భగత్ సింగ్, రాణి లక్ష్మీబాయి మరియు సుభాష్ చంద్రబోస్ వంటి వీరులు మన దేశ స్వాతంత్ర కోసం తమ జీవితాలను అంకితం చేశారు. వారి అచంచలమైన సంకల్పం మన దేశానికి సానుకూలంగా సహకరించడానికి మానకు స్ఫూర్తినిస్తుంది అని అన్నారు.