విశాలాంధ – జెఎన్టియు ఏ: ప్రపంచానికి ఇండియా ఆదర్శంగా నిలుస్తూ ఉందని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి పేర్కొన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్స వేడుకలను పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ యాప్స్, యూపీఐ, ఆధార్ సేవలు ప్రభంజనం సృష్టించాలని అన్నారు. మహిళల పాత్ర అత్యంత కీలకమైన.. దేశ ఆర్థిక, సామాజిక, సైనిక, వైమానిక, నాయకత్వ రంగాలలో మార్గదర్శకంగా నిలుస్తున్నారు. జపాన్ యూనివర్సిటీ విద్యార్థు కళాశాలలో ఇంటర్నెట్ చేసేందుకు వచ్చారని.. విద్యార్థులు ప్రపంచ స్థాయి టెక్నాలజీపై నిరంతరం అధ్యయనం చేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీ యువరాజ్, వ్యాయామ డైరెక్టర్ దామోదర న్, ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ సమీనా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.