Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

స్ఫూర్తి ప్రదాత – పల్లె ఉమా

మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: విద్యార్థుల జీవిత కలల స్వప్నాన్ని సహకారం చేయడంలో, రాజకీయ, సామాజిక, సేవా కార్యక్రమాలలో స్ఫూర్తి ప్రదాతగా ప్రజలు, విద్యార్థుల హృదయాలలో పల్లె ఉమా పదులంగా నిలిచి ఉందని శ్రీ బాలాజీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పి వి కే కే ఇంజనీరింగ్ కళాశాలలో పల్లె ఉమా జయంతి వేడుకలను పురస్కరించుకుని కళాశాల చైర్మన్ డా. పల్లె కిషోర్ , కరస్పాండెంట్ డా. పల్లె రఘునాథ్ రెడ్డి,ట్రెజరర్ పల్లె సింధూర రెడ్డి సేవలను స్మరించుకుంటూ కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులు, సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం వారికి ఘన నివాళిగా అర్పించారు.
ఈ సందర్భంగా, మాజీ మంత్రివర్యులు, కళాశాల కరెస్పాన్దేంట్ డా.పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ ..ప్రతి విజయవంతమైన మగవాడి వెనక ఖచ్చితంగా ఒక ఆడది ఉంటుందనేది అక్షర సత్యమని, నేడు శ్రీ బాలాజీ విద్యా సంస్థలలో వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తూ అనేక రంగాల్లో ఉన్నత స్థాయిల్లో స్థిరపడటానికి పల్లె ఉమా గారి ఎంతో కృషి ఉందని, ఒక ఉత్తమ భార్య గా తను నాకు అండగా ఉన్నందునే నేను రాజకీయ రంగం ద్వారా ప్రజలకు సేవ చెయ్యటం లోనూ మరియు విద్యా రంగం ద్వారా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుని నిర్మించడం లోనూ రాణించగలిగానని తెలిపారు.కళాశాల చైర్మన్ డా.పల్లె కిషోర్ మాట్లాడుతూ “ఒక తల్లిగా తన జీవితాన్ని తీర్చిదిద్దటమే కాకుండా, బాలాజీ విద్యా సంస్థల కరేస్పాన్దేంట్ గా వేల మంది విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిన శ్రీమతి పల్లె ఉమా గారి సేవలను స్మరించుకుంటూ , కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల హితాన్ని కాపాడడంలో ఉమా గారి విశేష కృషి గురించి ప్రస్తావిస్తూ, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు, సమాజంలో పాజిటివ్ మార్పులకు వారు చేసిన కృషి ని ప్రశంసించారు.విద్యార్థులపై వారి అచంచల ప్రేమ, శ్రేయస్సుకు వారు చేసిన కృషిని చెబుతూ పలువురు ప్రసంగించారు. ఈ జయంతి వేడుకలు పి వి కే కే ఇంజనీరింగ్ కళాశాల సాంస్కృతిక వారసత్వాన్ని, విద్యకు అంకితభావాన్ని, సమాజ సేవకు చేసిన కృషిని గుర్తుచేసే కార్యక్రమంగా నిలిచింది.ఈ కార్యక్రమం లో కేరళ మాజీ డీజీపీ శంకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఆర్ ఐ ఓ పల్లె రామకృష్ణ రెడ్డి గారు, ప్రత్యేకాధికారి ప్రో.శ్రీనివాసులు రెడ్డి, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, పీవీకేకే ఐటీ ప్రిన్సిపాల్ డా.బండి రమేష్ బాబు, డీన్ డా.సంతోష్ రెడ్డి, ఏ ఓ డా.మనోహర్ రెడ్డి, డిప్లొమా ప్రిన్సిపాల్ డా.వైభవ్, శ్రీ బాలాజీ పీజీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా. సుబ్బారావు, డా.మన్మదేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఉమా గారి జయంతి సందర్భంగా శ్రీ బాలాజీ విద్యా సంస్థలలో అన్ని కళాశాలలో విరివిగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img