Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

కుష్టు వ్యాధి ఏ దశలో నైనా నయమవుతుంది

డా- దేవసాగర్ ,జాయింట్ డైరెక్టర్
విశాలాంధ్ర – అనంతపురం : జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నందున రాష్ట్ర కుష్ఠు వ్యాధి నివారణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ దేవసాగర్ కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది. ఇదే సందర్భంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా ఈ బి దేవి. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డా మాణిక్య రావు , ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డా వెంకటేశ్వరరావు ను ,ప్రభుత్వ ఆసుపత్రి చర్మ వ్యాధుల విభాగం వైద్యుల తో కుష్ఠు వ్యాధి నిర్ములన కార్యక్రమం ఫై సంబంధిత అధికారులకు తగు సూచనలు ,ఆదేశాలు ఇవ్వడం జరిగింది..
ఈ సందర్భంగా డాక్టర్ దేవసాగర్ ,జె డి మాట్లాడుతూ… జిల్లాలోని ప్రతి ఇంటిని ఏఎన్ఎం ,వాలంటీర్స్ ,సందర్శించడం జరుగుతుందని ఇంటి నందు ఉన్న ప్రతి ఒక్కరూ కుష్టి వ్యాధి లక్షణాలు ఉన్న ,చర్మంపై స్పర్శ జ్ఞానం లేని నొప్పి లేదా దురద లేని మచ్చలు ,చర్మంపై ఎర్రని లేదా రాగి రంగు మచ్చలు ,చేతులు పాదాలు తిమ్మిర్లు ,కలిగి ఉన్న కనుబొమ్మమరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం ఉన్న ఇతర ఏ రకమైన అనుమానిత లక్షణాలు ఉన్న మీ ఇంటి వద్దనే వైద్య సిబ్బందికి చూపించాలని కుష్టు వ్యాధి ని నిర్ధారించుకోవాలని అన్నారు.
ప్రాథమిక దశలో కుష్టు వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకున్నాచో కుష్టు వ్యాధి ఏ దశలోనైనా నయమవుతుందని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల యందు ఉచితంగా మందులు లభిస్తావని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. .కుష్టు వ్యాధి ఒక సాధారణమైన వ్యాధి అని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. కుష్టి వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నచో అంగవైకల్యం వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు.
కాబట్టి ఎవరికైనా కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్నట్లయితే మందులు సక్రమంగా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ గంగాధర్ రెడ్డి ,పిఎమ్ఓ నాగన్న ,హెచ్ ఈ ఓ సత్యనారాయణ ,పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img