Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఐక్యమత్యంతో జేఎన్టీయూ అగ్రస్థానంలో నిలుపుదాం

వీసీ సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఐక్యమత్యంతో ప్రగతి అగ్రస్థానంలో నిలుపుదామని ఇన్చార్జ్ వీసీ ఆచార్య సుదర్శన్ రావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ ఆడిటోరియం లో యూనివర్సిటి ఆవిర్బావ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ .. సాంకేతిక విద్య బోధన, పరిశోధన పరికరాలు, వినూత్న ఆవిష్కరణలు, కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ వనరుల వినియోగం, క్రీడా, సేవ స్ఫూర్తి నిలిచేలా కృషి చేయాలన్నారు.
అనంతరం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య మాట్లాడుతూ.. పాఠ్యాంశాలలోని మూలాలను అన్వేషణ చేస్తూ.. పరిశోదాత్మక అధ్యయనం చేపట్టాలన్నారు. బోధన, బోధ నేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకే వృక్ష నీడలో నివసిస్తూ.. అభివృద్ధిలో పాలు పంచుకుందామని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పి. చెన్నా రెడ్డి మాట్లాడుతూ.. సదస్సులు, అధ్యాపకుల బోధనలు, విద్యార్థులతో నిరంతరం పాఠ్యాంశాలపై అన్వేషణ చేపట్టడంతో విజయాలను సొంతం చేసుకోగలరు అన్నారు.
వర్క్ షాపులు, గెస్ట్ లెక్చర్ లు , స్పోర్ట్స్ , మొదలగు సాంస్కృతిక కార్యక్రమాలలో గెలుపొందిన విద్యార్థులకు ఉపకులపతి , రిజిస్ట్రార్ , ప్రిన్సిపాల్ చేతుల మీదగా బహుమతులు సర్టిపికెట్లు, ప్రైజులను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి వీసీ ఆచార్య ఎన్. దేవన్న , యూనివర్సిటీ డైరెక్టర్లు, ఆచార్య ఎస్.వి. సత్యనారాయణ , ఆచార్య పి.ఆర్. భాను మూర్తి , డి ఎ ఆచార్య నాగ ప్రసాద్ నాయుడు , ఓటిపిఆర్ఐ డైరెక్టర్ ఆచార్య బి. దుర్గా ప్రసాద్ , ఆచార్య బి. ఈశ్వర్ రెడ్డి , ఆచార్య ఎన్. విశాలి , ఆచార్య వైశాలి ఘోర్పడే , ఆచార్య ఆర్. కిరణ్మయి , ఆచార్య వి.బి. చిత్ర , ఆచార్య పి. సుజాత , ఆచార్య ప్రశాంతి గారు, ఆచార్య ఎ. సురేష్ బాబు , ఆచార్య పద్మ సువర్ణ , ఆచార్య ఎ.పి. శివ కుమార్ , ఎంబీఏ విభాగాధిపతి ఆచార్య టి. నారయణ రెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్. వసుంధర , పులివెందుల కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఆర్. రమణారెడ్డి , వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య జి.వి. సుబ్బా రెడ్డి , కలికిరి కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం. వెంకటేశ్వర్ రావు , వైస్ ప్రిన్సిపాల్ గారు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శారద , భోధన, భోధనేతర సిబ్బంది, విద్యార్థులు, ఔట్సొర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img