విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: ప్రకృతి విపత్తులుతో అంతరించిపోతున్న జీవ వైవిధ్యాన్ని సంరక్షించుదాం పి.వి . కె . కె పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మునికృష్ణారెడ్డి పేర్కొన్నారు. వృక్ష సంపద రోజురోజుకి అడుగుతూ పోతున్న తరుణంలో.. వాటి సంరక్షణకు పివికేకే పీజీ కళాశాల బొటనీ కె. జోష్ణ అధ్యాపకురాలు ఆధ్వర్యంలో అనంతపురం సరిహద్దు ప్రాంతంలో విద్యార్థి బృందంతో క్షేత్రస్థాయి అన్వేషణ చేపట్టారు.ట్రిబ్యులస్ టెరిస్ట్రీస్,టెంపోషియా పర్చూరియా, అకాలిఫా ఇండికా మొక్కల యొక్క ఆవశ్యకత గురించి విద్యార్థులకు వివరించారు. మానవాళి ఆరోగ్య సంరక్షణలో మొక్కలు ఔషధంగా నిలుస్తూ.. ఆధునిక యుగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థి బృందం పాల్గొన్నారు.