విశాలాంధ – జేఎన్టీయూ ఏ : హెల్మెట్ ,సీటు బెల్ట్ ధరించుదాం .. ప్రాణాలను కాపాడుకుందామని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ .వి సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హెల్మెట్ , సీటు బెల్ట్ ధరించడం పై డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ వీర్రాజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. హెల్మెట్ ధరించడం వలన తీవ్రమైన గాయల , మరణాల నుంచి రక్షణ ఇస్తుందని, కొద్దిపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకోకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని తెలిపారు. కారులో ప్రయాణించేటప్పుడు అయితే సీటు బెల్ట్, మోటారు వెహికల్ లో ప్రయాణించేటప్పుడు అయితే హెల్మెట్ పెట్టుకోవాలని ఇవి ధరించడం వలన తలకు బలమైన గాయాలు తగిలే అవకాశాలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అంకారావు మొగిలి , కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య ఇ. అరుణ కాంతి , ఆచార్య ఎ. ఆనందరావు , ఆచార్య టి. బాల నరసయ్య , ఆచార్య ఓం ప్రకాష్ , డాక్టర్ కే.ఎఫ్. భారతి , డాక్టర్ జి. మమత , డాక్టర్ కళ్యాణి రాధ , యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ శారద , డాక్టర్ శ్రీధర్ , అజిత , విద్యార్థులు పాల్గొన్నారు.