వేడుకలలో సౌకర్యాల కల్పన, భద్రత, పరేడ్ లలో ఎలాంటి లోపాలు లేకుండా శ్రమిద్దాం
— జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15 న ఘనంగా జరిగే 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు మరియు ఁ రియల్ టైం ఫుల్ డ్రెస్ పరేడ్ రిహార్సల్స్ఁ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ
ఈ రిహార్సల్స్ లో భాగంగా… ముందుగా గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఎగుర వేశారు. అనంతరం పరేడ్ పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పరేడ్ ను పరిశీలించారు.
అనంతరం… పంద్రాగస్టు రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, తదితర వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్ర్య సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజలకు కల్పించాల్సిన భద్రత మరియు సౌకర్యాలను సమీక్షించారు. పటిష్ట బందోబస్తు, ఏర్పాట్లతో ఎటువంటి అసౌకర్యం లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ తగిన భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ
ప్రతి ఒక్కరినీ డి ఎఫ్ ద్వారా తనిఖీ చేసి పంపాలని…స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రారంభం నుండి ముగిసే వరకు జరుగు అన్ని అంశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
వాహనాల పార్కింగ్ నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచనలు… అనంతరం పోలీసు జాగిలాల ప్రదర్శన నిర్వహించారు.
ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజ, ఆర్ ఐ లు రాముడు, మధు, తదితరులు పాల్గొన్నారు.