-వ్యవసాయాధికారి బీఆర్ శేఖర్ రెడ్డి
విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశెనగ సాగు చేయనందున రైతులకు కరువు ఆధారిత ప్రణాళిక కింద 80 శాతం రాయితీపై ఉలవలు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయాధికారి బీఆర్ శేఖర్ రెడ్డి తెలిపారు. రాప్తాడు రైతు సేవా కేంద్రంలో శుక్రవారం రైతులకు సబ్సిడీపై ఉలవలు పంపిణీ చేశారు. ఉలవలు తీసుకున్న రైతులు తమ పొలాల్లో సాగు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏ శీనా,
మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శీనా, సర్పంచ్ సాకే తిరుపాల్, జి.రాముడు, బి.ఆంజనేయులు, సి.వెంకటేష్, దండు నరేంద్ర, తలారి శివ తదితరులు పాల్గొన్నారు.