ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్య రావు
విశాలాంధ్ర – అనంతపురం : భారత దేశ ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా ఢిల్లీ లోని ఎర్రకోట లో నిర్వహించే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల లో ద్వితీయ సంవత్సరం ఎమ్ బి బి ఎస్ చదువుతున్న ఎ.జి.పరిణీత సాయి, కె.హర్ష శ్రీ విష్ణు లు ఎంపికైనట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్య రావు తెలిపారు.ఎన్ ఎస్ ఎస్ సమాజ సేవా కార్యక్రమాలు లో, మేరి మట్టి మేరా దేశ్,అమృత వాటిక,రక్తదానం,మొక్కలు నాటే కార్యక్రమంలు,అవయవ దానం,కూచిపూడి,భరతనాట్యం,శాస్ర్తీయ సంగీతం తదితర అంశాల లో ప్రావీణ్యాన్ని గుర్తించి డాక్టర్ ఎన్ టి ఆర్ అరోగ్య విశ్వ విద్యాలయం తరఫున ఇన్చార్జి వైస్ ఛాన్సలర్ డాక్టర్ నరసింహం,రిజిస్ట్రార్ డాక్టర్ రాధికా రెడ్డి,ఎన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డాక్టర్ వివేకానంద లు మా విద్యార్థుల ప్రతిభ ను గుర్తించి సెలెక్ట్ చేశారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్య రావు తెలిపారు.ఆంధ్ర ప్రదేశ్ నుంచి 20 మంది యువకులకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించగా అందులో మా అనంత వైద్య విద్యార్థులు ఇద్దరు సెలెక్ట్ కావడం హర్షణీయమన్నారు.విద్యార్థుల ను ఎన్ ఎస్ ఎస్ లో ఇలాంటి అవకాశాలు వచ్చేలా ప్రోత్సహిస్తున్న మా కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు అభినందనీయుడు అన్నారు.ఈ నెల 11 వ తేదీన విద్యార్థులు డిల్లీ కి వెళ్లి రాష్ట్రపతి భవన్ దగ్గర ఇంటర్నేషనల్ యూత్ హాస్టల్ లో 13,14,15 మూడు రోజులు ఆతిధ్యం తీసుకోనున్నారు.డిల్లి లోని ముఖ్య ప్రదేశాలని ఉచితంగా చూపించడం,ఆ రోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు లో పాల్గొనడం,పరెడ్ ను స్పెషల్ గాలరీ లో ప్రత్యేక ఆహ్వానితులు గా తిలకించి ఉపరాష్ట్రపతి భవన్ లో విందు కు హాజరవుతారని ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు తెలిపారు.