విశాలాంధ్ర, కదిరి : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి పలువురికి పంచి పెట్టారు.సినీ పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కాయల చలపతి, ఉపాధ్యక్షలు పులగం పల్లి రాజా, రవి, కిన్నెర మహేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.