విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ కళాశాల లో బి.టెక్ చదువుతున్న 4 మంది విద్యార్థిలకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు , అస్సాం రైఫిల్స్ కోసం ప్రైమ్ మినిస్టర్స్ స్కాలర్‌షిప్ స్కీమ్ స్కాలర్షిప్ లు ఎంపికైనట్లు బుధ వారం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా స్కాలర్షిప్ అందజేస్తున్నారని ఆయన అన్నారు. గునుపురు సందీప్, వడ్డే తేజ్ దీప్, పాకనాటి శివ కుమార్ గౌడ్ , కె లక్ష లు , బెస్త గాయత్రి, జొన్నవరం వసుందర లు విద్యార్థులకు ఒక్కక్కరికి 30.000 చెప్పున , ఇద్దరు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వారికీ 12000/- చెప్పున స్కాలర్షిప్ అందజేసినట్లు ఆయన అన్నారు. స్కాలర్‌షిప్‌లు అందుకున్న విద్యార్థులను కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరి మెరిట్ యు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ డాక్టర్ సమీనా, మౌలాలి అభినందనలు తెలిపారు.