విశాలాంధ్ర,కదిరి : కదిరి మున్సిపల్ పరిధిలోని పార్థసారథి కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడు ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆలయ కమిటీకి భరోసా ఇచ్చారు.కాలనీ వాసులందరు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి,తలుపులు గంగాధర్, కాలనీ వాసులు పాల్గొన్నారు