డాక్టర్ ఈ బి దేవి డిఎం అండ్ హెచ్ ఓ
విశాలాంధ్ర- అనంతపురం : ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాపిస్తుందని
కనుగొన్న మొట్ట మొదటి బ్రిటిష్ వైద్యుడుసర్ రోనాల్డ్ రాస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, సర్ రోనాల్డ్ రాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ఆడ అనాఫిలస్ దోమ ద్వారా మలేరియా వ్యాధి వస్తుందని మొట్టమొదట కనుగొన్న వ్యక్తి సర్ రోనాల్డ్ రాస్ గొప్ప శాస్త్రవేత్త అని జన్మతహా బ్రిటిష్ దేశస్తుడు ఐ నప్పటికీ. హైదరాబాద్ లో పనిచేయడం జరిగింది హైదరాబాద్ లోనే చివరికి కన్నుమూశారు అని తెలిపారు ,దోమలు నివారించినచో మలేరియా నుంచి రక్షణ పొందవచ్చు అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సుజాత,డెమో త్యాగరాజు, ఆరోగ్య విద్య అధికారి గంగాధర్, అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ సత్యనారాయణ,మద్దయ్య, భాష మొదలగు వారు పాల్గొన్నారు.