విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం అర్బన్ నియోజకవర్గం 12వ డివిజన్ సున్నపుగెరిలోని శ్రీ రామస్వామి దేవాలయంను సందర్శించిన అనంతరం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి అయిన ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీలో అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మి నారాయణ పాల్గొని, లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, డిఆర్డిఏ పిడి, ఏపీడి మరియు స్థానిక డివిజన్ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.