విశాలాంధ్ర, కదిరి : కదిరి మండల తహసిల్దారుగా మురళీ కృష్ణ శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. మురళీ కృష్ణ చిత్తూరు జిల్లా కుప్పం తాలూకా శాంతిపురం మండలం తహసీల్దార్ గా భాద్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కదిరి తహసీల్దార్ బదిలీలో ఇక్కడ భాద్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా మురళీ కృష్ణ మాట్లాడుతూ మండల ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, కార్యాలయ అధికారులతో సిబ్బందితో సమన్వయంగా ఉంటూ వారి సహాయ సహకారాలతో అభివృద్ధి చేస్తానని తెలిపారు. అనంతరం కార్యాలయ అధికారులు సిబ్బంది మురళీ కృష్ణకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది ముకుంద, రమణ పలువురు వి ఆర్ ఓలు పాల్గొన్నారు.