విశాలాంధ్ర – అనంతపురం : సమాజంలో ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగి, ఇతరులకు అవగాహన కల్పించే విధంగా ఉండాలని ఎస్ ఎస్ బి ఎన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రాజు పేర్కొన్నారు. నగరంలోని ఎస్ ఎస్ బి ఎన్ డిగ్రీ కళాశాలలో ఝాన్సీ లక్ష్మి కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, సి స్ సి 2.0 ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రాజు వృక్ష రాజ్యం హెచ్ ఓ డి మాధవి, ఝాన్సీ లక్ష్మి సి బి ఓ పిడి నాగమణి,, కోఆర్డినేటర్ భారతి, జంతుశాచుల ఉపన్యాసకులు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ… మన పాఠ్యాంశాలలో ఉన్నటువంటి హెచ్ఐవి ఎయిడ్స్ విషయాలపై అవగాహన కలిగించుకొని గ్రామీణ ప్రాంతాలలో అవగాహనలు కల్పించాలన్నారు. వృక్షశాస్త్ర ఉపన్యాసకులు మాధవి మాట్లాడుతూ… వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, వ్యాధి సోకిన వారికి అధైర్య పరచకుండా జీవితకాలం ఎలా పెంచుకోవాలా అనేటువంటివి అవగాహన కల్పించాలన్నారు. పిడి నాగమణి మాట్లాడుతూ… 2004 సం నుండి హెచ్ఐవి వారికి ఎన్నో సేవలు చేస్తూ, చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడం జరిగిందన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావం కాకుండా జీవితాన్ని సన్మార్గంలో నడుచుకోవాలన్నారు. హెచ్ఐవి ఎలా వస్తుంది వాటిని రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని కోఆర్డినేటర్ భారతి సూచించారు. ఈ కార్యక్రమం లో కళాశాల సిబ్బంది, సంస్థ సభ్యులు పద్మావతి, మహేష్,, జయలక్ష్మి, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.