అనంతపురం జిల్లా కలెక్టరేట్ ను పరిశీలించిన ఐ.ఎస్.ఓ ప్రత్యేక బృందం సభ్యులు
విశాలాంధ్ర – అనంతపురం : ఐ ఎస్ ఓ 9001:2015 సర్టిఫికేట్ ను పొందేందుకు జిల్లా కలెక్టరేట్ ముస్తాబవుతోంది. ఈ మేరకు మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం సందర్శించింది. గ్లోబల్ మేనేజ్మెంట్ సర్టిఫికేషన్ సర్వీసెస్ సంస్థకు చెందిన లీడ్ ఆడిటర్, కె.ఎస్.ఎన్. ప్రసాద్, ఆడిటర్ రాజేష్, కో-ఆడిటర్ సింగయ్య బృందం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సందర్శించింది.
అనంతపురంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఐ.ఎస్.ఓ ప్రమాణాలకు అనుగుణంగా ముస్తాబవుతోంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సలహాలు, ఆదేశాల మేరకు డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని సమూలంగా మార్పు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా ఐ ఎస్ ఓ 9001:2015 సర్టిఫికేట్ ను పొందాలంటే 39 రకాల ప్రమాణాలు అవసరం అవుతాయన్నారు. అందులో సమావేశ మందిరాల వద్ద కొటేషన్లు/పోస్టర్లు, గదులు/ఛాంబర్‌లు/ క్యాబిన్‌ల కోసం గుర్తింపు బోర్డులు, హోదా బోర్డులు, ఆర్ టి ఐ ప్రదర్శన చార్ట్, రికార్డ్ రూమ్ నిర్వహణ, ఫైల్ డిస్పోజల్ డాక్యుమెంటేషన్, కంప్యూటర్స్ నంబరింగ్,సర్వీస్ రిపోర్ట్ & నెట్‌వర్క్ రేఖాచిత్రం, ఇ-వేస్ట్ మేనేజ్‌మెంట్, ఫర్నిచర్,అల్మరాస్ఫ్యాన్స్ కోసం నంబరింగ్, ఐడి కార్డులు, వ్యవస్థా పట్టిక, ఆఫీస్ ప్రొసీజర్ ఫ్లో, కొనుగోలు రిజిస్టర్, రికార్డులు, విక్రేతల జాబితా, స్టాక్ రిజిస్టర్, తపాల్ రిజిస్టర్, మినిట్స్ రిజిస్టర్, సందర్శకుల నమోదు రిజిస్టర్, ఫిర్యాదుల రిజిస్టర్, రిసెప్షన్ టేబుల్, వర్క్ టైమింగ్ బోర్డు, లంచ్ టైమింగ్స్, ఫైర్ ఎన్ఓసి, బిల్డింగ్ ఫిట్నెస్ & లేఅవుట్, బిల్డింగ్ రిపేర్‌ల కోసం ప్రొక్యూర్‌మెంట్/కొనుగోలు విధానం, నాణ్యత ప్రమాణము, గోల్స్,ఆబ్జెక్టివ్స్ (లక్ష్యాలు), కమిటీల ఏర్పాటు, ఫిర్యాదుల కమిటీ, ఫిర్యాదు & ఫీడ్‌బ్యాక్ బాక్స్‌లు, నోటీసు బోర్డులు, సురక్షిత నిష్క్రమణ పాయింట్లు, ప్రధమ చికిత్స పెట్టె, సైన్ బోర్డులు, ఫ్లోర్ ఐడెంటిఫికేషన్ బోర్డులు, అత్యవసర సంప్రదింపు నంబర్ల జాబితా, శిక్షణల రిజిస్టర్, సిటిజన్ చార్ట్ మరియు మంచినీటి సౌకర్యం, సందర్శకుల వేచిఉండే గది, దినపత్రికలు, వారపత్రికలు లాంటి అన్ని రకాల ప్రమాణాలు అవసరమవుతాయన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మెజిస్టీరియల్ విభాగము నందు(లా అండ్ ఆర్డర్, గన్ లైసెన్స్, పేలుడు పదార్థాల లైసెన్సులు ), కోఆర్డినేషన్ విభాగము నందు ( భూ వివాదము, ఆర్ఓఆర్ ప్రోటోకాల్ ఆర్ఆర్ యాక్ట్, విపత్తుల నివారణ, ఎలక్షన్స్), తపాల విభాగము, పరిపాలన విభాగము, ల్యాండ్ విభాగము, ఎన్నికల విభాగము, రెవెన్యూ భవన్, గ్రీవెన్స్ విభాగము, ఏపీ స్పాన్, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, కెఆర్ఆర్సి విభాగములను హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం పరిశీలించారు. అయితే అవన్నీ ఐ.ఎస్.ఓ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు, చేర్పుల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో మారుతి, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సెక్షన్ సూపరింటెండెంట్ లు, డీటీలు, సీనియర్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.