విశాలాంధ్ర- తనకల్లు : మండల పరిధిలోని సి ఆర్ పల్లి పంచాయతీ తొట్లి వారి పల్లికి చెందిన నడిమింటి శంకర్ గత 14 సంవత్సరాలుగా ఉత్తమ సేవలందిస్తున్నందుకు మదర్ తెరిసా సొసైటీ తరఫున ఉత్తమ సేవకుడిగా జాతీయ పురస్కారం అందింది. విజయవాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాక్షేత్రంలో మదర్ తెరిసా సంస్థ నిర్వాహకులు సోమవారం గ్రేట్ సోషల్ వర్కర్ గా అంబేద్కర్ జాతీయ అవార్డును అందించారు సేవా కార్యక్రమాలతో పాటు గత పది సంవత్సరాలుగా నిఘా చైతన్య దినపత్రికకు సంపాదకులుగా శంకర్ సమాజానికి సేవలందిస్తున్నారు. అవార్డు గ్రహీత శంకర్ మాట్లాడుతూ ఈ అవార్డుతో సమాజంలో సేవా నిరతి పై మరింత బాధ్యత పెరిగిందని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయడంలో తన వంతు శక్తి పంచన లేకుండా కృషి చేస్తానన్నారు.అవార్డు అందుకున్నందుకు మిత్రులు శ్రేయోభిలాషులు ఆయనకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.