asd
Monday, July 15, 2024
Monday, July 15, 2024

7న నీలం విజయకుమార్ రెడ్డి సంతాప సభ

విశాలాంధ్ర – అనంతపురం : సిపిఐ అగ్ర నాయకులు నీలం రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు డాక్టర్ నీలం విజయకుమార్ రెడ్డి సంతాప సభ ఈ నెల 7న (ఆదివారం) ఉదయం 11గం.లకు జాతీయ రహదారి సాక్షి ఎడిషన్ కార్యాలయ ప్రక్కన నీలం రాజశేఖరరెడ్డి కన్వెన్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు అనంతపురం సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి. జగదీష్ హాజరవుతారని జాఫర్ తెలిపారు. ఈ సంతాప సభకు సిపిఐ నాయకులు, కార్యకర్తలు, హాజరవుతారు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img