విశాలాంధ్ర – శెట్టూరు : మండలంలోని కురిసిన వర్షానికి వివిధ గ్రామాల్లో చెరువులు కుంటలు వాగులు చెక్ డ్యాములు నీటితో పొంగిపొర్లాయి ములకలేడులో రైతు ఓబుల నాయుడుకు చెందిన మిరప తోటలో నీటిలో మునిగిపోయింది దాదాపుగా లక్ష రూపాయలు దాకా నష్టం అయిందని రైతు తెలిపారు విషయాన్ని తెలుసుకున్న ఉద్వాన శాఖ అధికారి గౌసియా బేగం మంగళవారం వర్షానికి దెబ్బతిన్న టమోటా, మిరప,పంట పొలాలను పరిశీలించారు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి అన్ని విధానంగా ఆదుకుంటామని రైతులకు భరోసా కల్పించారు