విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ను 1వ పట్టణ నూతన సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న సిఐ రెడ్డప్ప బదిలీపై ధర్మవరం టూ టౌన్ కువెళ్లగా.. ఆ స్థానంలోకి రాజేంద్రనాథ్ యాదవ్ వచ్చారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవాళ ఎమ్మెల్యే దగ్గుపాటిని సిఐ రాజేంద్రనాథ్ కలిశారు. వన్ టౌన్ పరిధిలోని పలు అంశాల గురించి ఎమ్మెల్యే చర్చించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడద్దని ఇందులో పార్టీలు ఎక్కడా చూడాల్సిన పని లేదన్నారు. ఎవరైనా పార్టీ పేరు కాని, నా పేరు చెప్పి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఉపేక్షించవద్దన్నారు. సామాన్య ప్రజలకు న్యాయం జరగడమే తనకు ముఖ్యమని ఎమ్మేల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.