ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లా డ్వామా ఇన్ ఛార్జ్ పీడీగా పి.విజయలక్ష్మి ని నియామిస్తూ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న పీడీ వేణుగోపాల్ రెడ్డిని మాతృశాఖకు బదిలీ చేస్తూ గత వారంలో ప్రభుత్వం జారీ చేసింది. దీంతో డ్వామా జిల్లా కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సీనియర్ డిఎల్ డిఓ పి.విజయలక్ష్మి కి ఇన్ ఛార్జ్ పీడీగా నియమించారు. ఇన్చార్జి పిడి గతంలో మెప్మా పీడీగా, ఐసిడిఎస్ పీడీ గా పనిచేశారు. కరోనా సమయంలో కూడా మంచి సేవలు అందించి జిల్లా అధికారుల మన్నలలను పొందారు. నూతన ఇన్చార్జి పీడీ బుధవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.