-సీఎం చంద్రబాబుకు పరిటాల శ్రీరామ్ అందజేత
విశాలాంధ్ర-రాప్తాడు : విజయవాడ ప్రాంతంలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చి.. వేలాది మంది నిరాశ్రయులై చాలా కుటుంబాలు సర్వం కోల్పోవడంతో బాధితులకు తమ వంతు సాయంగా పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్టు తరపున అండగా నిలిచేందుకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ ముందుకొచ్చారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబుకు పరిటాల శ్రీరాం బుధవారం రూ.5లక్షలు చెక్కును అందజేశారు. శ్రీరాం మాట్లాడుతూ ఇప్పటికే ట్రస్టు తరపున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. విజయవాడ వరద బాధితులు ఎంతో నష్టపోయారని.. మనం వారికి ఎంత ఇచ్చినా తక్కువేనన్నారు. అందుకే మా వంతు ఈ సాయం చేస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులకు బాసటగా నిలిచి బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి వారి కష్ట, నష్టాలు తెలుసుకుంటూ వారిలో ధైర్యం నింపారన్నారు. ఈ సందర్బంగా పరిటాల శ్రీరామ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను కూడా గౌరవపూర్వకంగా కలిశారు.