ఏఐవైఎఫ్ అనంత జిల్లా సమితి డిఆర్ఓ రామకృష్ణారెడ్డికి వినతులు
విశాలాంధ్ర -అనంతపురం : అనంతపురం జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అనంత జిల్లా గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాల పనులను ప్రారంభించాలని గురువారం కలెక్టరేట్లో డి ఆర్ ఓ రామకృష్ణారెడ్డి ని కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ… అనంత జిల్లా వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వంలో విలేజ్ హెల్త్ క్లీనిక్లకు సంబంధించి అనంతపురం నగర పరిధిలోని రుద్రంపేటలో ఒక్కటి, కళ్యాణ్ దుర్గం సంబంధించి కుందిర్పి మండలం నూతిమడుగు గ్రామంలో కంబదూరు మండలం ఏనుములదొడ్డి గ్రామంలో ఒకటి గార్లదిన్నె మండలం ఎర్రగుంట్ల గ్రామంలో ఒకటి రాయదుర్గం తాలూకా గుమ్మగట్ట మండలం తాళ్లకెర గ్రామంలో రెండు విలేజ్ హెల్త్ క్లీనిక్లు ప్రారంభమైన ఇప్పటివరకు ఎలాంటి పనులకు నోచుకోలేదన్నారు. పునాది గోడలకీ లక్ష రూపాయలు కూడా ఖర్చు కానీ దానికి నాలుగు లక్ష రూపాయలు అధికారులు చెప్తున్నారంటే ఉన్నతస్థాయి అధికారులే ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత పాలకులు నిధులు మల్లించారు అనే ఆలోచనలు వ్యక్తం అవుతున్నాయి అని పేర్కొన్నారు. ఇవి ఒక్కటే కాకుండ జిల్లా వ్యాప్తంగా వీటి పై సమగ్ర విచారణ చెప్పటి ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు మొదలు పెట్టాలన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రకరకాల వ్యాధులతోన డెంగ్యూ మలేరియా వ్యాధులతోను మరియు రకరకాల వ్యాధులతో స్థానిక ప్రజలు పట్టణాలకు విద్యార్థులు, వృద్ధులు, వితంతువులు, ప్రతి ఒక్కరికి సమయానికి వైద్యం అందక ప్రాణాలు వదలవలసిన పరిస్థితి నెలకొంది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్థాయి ఆరోగ్య కేంద్రాలు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టక్క మంగళం పడుతూ స్థానిక అధికారులు వీటిపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలకు ఇబ్బంది గురి చేస్తున్నారన్నారు. గత వైసిపి ప్రభుత్వం లో ఏవైతే గ్రామస్థాయి ఆరోగ్య కేంద్రాలకు అనుమతులు లభించాయో వాటిని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులో తీసుకొని స్థానిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లను ఏర్పాటు చేసి ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యాన్ని అందజేసేలాగా చూడాలని అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో డీఆర్వో కి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో ఏఐవైఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కొట్రెష్ ఏఐవైఎఫ్ అనంతపురం నగర అధ్యక్షులు శ్రీనివాస్ నాయకులు మోదీన్ భాష, అభి, దివాకర్, హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.