విశాలాంధ్ర – శెట్టూరు : వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అఖిల, పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున తెలిపారు గురువారం మండల పరిధిలో అడవి గొల్లపల్లి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షానికి రోడ్డుపైన నీళ్ళు నిలవడంతో దోమలతో ప్రజలు ఇబ్బందిగా గురవుతున్నారని విషయాన్ని తెలుసుకున్న వైద్య సిబ్బంది గ్రామాలలో వారు పర్యటించి సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు వారు మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నడంవల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా అందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని డ్రమ్ములు తొట్టెల నీళ్లు ఎక్కువ నీళ్లు నిలువ ఉంచకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు తెలియజేశారు అనంతరం నీరునిల్వ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులను స్ప్రేయింగ్ చేస్తూ సీజనల్ వ్యాధులు భారీ నుంచి ప్రజలను కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ మీనాక్షమ్మ గ్రామ పంచాయతీ సిబ్బంది అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు