విశాలాంధ్ర – అనంతపురం : ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ల సహకారంతో స్వచ్ఛతా హి సేవా విభాగం విద్యార్థుల కోసం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఉపకులపతి ఏ కోరి బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
15రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా, 150 మంది విద్యార్థులు ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం ద్వారా పర్యావరణంపట్ల అవగాహనను పెంపొందించడం, విశ్వవిద్యాలయ విద్యార్థుల బాధ్యతను గుర్తుచేయడం ప్రధాన ఉద్దేశమన్నారు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణానికి ఈ కార్యక్రమం అంకితం చేయబడింది అన్నారు అన్నారు . క్యాంపస్‌లో పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడంలో విద్యార్థులకు ఉండవలసిన నిబద్ధతను గురించి పలువురు పునరుద్ఘాటించారు. విద్యార్థులు వారానికి రెండు గంటలు స్వచ్ఛంద స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయిస్తామని ప్రతిజ్ఞ చేశారు. వారి స్నేహితులని, కుటుంబ సభ్యులను సైతం స్వచ్ఛ భారత్ మిషన్‌లో చేరేందుకు ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో డీన్, ఆచార్య షీలారెడ్డి సహాయసహకారాలతో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ -1 ప్రోగ్రాం ఆఫీసరు డాక్టర్ వీఎస్‌ఎస్ శ్రేయ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.