శ్రీ చౌడేశ్వరి దేవాలయ అభివృద్ధి సంఘం
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని తొగటవీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణములో ఈనెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 102 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అభివృద్ధి సంఘం కమిటీ వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో వృద్ధులకు, పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలతోపాటు నెలకు సరిపడే మందులను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు దాసరి ఓబులమ్మ, కీర్తిశేషులు దాసరి నారప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు ప్రమీల, దాసరి మంజునాథ్ అండ్ సన్స్ వారు వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప,(దంత వైద్యులు) డాక్టర్ వెంకటేశ్వర్లు(చిన్నపిల్లల వైద్యులు) డాక్టర్ సాయి స్వరూప్(జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్), డాక్టర్ సతీష్ కుమార్(ఎముకల వైద్య నిపుణులు) డాక్టర్ జైదీపునేత(గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ హైదరాబాద్) లు రోగులకు వైద్య చికిత్సలు అందించి ఆరోగ్య సూత్రాలను కూడా వివరించడం జరుగుతుందని తెలిపారు. కావున ఇటువంటి అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.