Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 15, 2024
Sunday, September 15, 2024

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి

ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలి….
6న కలెక్టరేట్ వద్ద మహాధర్నాన్ని విజయవంతం చేయాలి…

సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పిలుపు

విశాలాంధ్ర- అనంతపురం : నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్టపరచాలిని తదితర డిమాండ్లతో ఈనెల 6న కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన మహాధర్నాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర్ కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య,స్థానిక పాతూరు నుంచి ధరలను నియంత్రించాలని, 6న కలెక్టరేట్ వద్ద మహాధర్నాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. బియ్యం, పప్పులు, చింతపండు వంటి నిత్యావసర వస్తువులతోపాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాగుతున్నాయన్నారు . పేద,సామాన్య,మధ్యతరగతి ప్రజల ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తోందన్నారు. దీనికితోడు పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పెంచిందన్నారు . పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారుతోంది. అధిక ధరల తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికే పరిమితమయ్యాయి అని పేర్కొన్నారు. :1. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలి. 2. ధరల
స్థిరీకరణకు బడ్జెట్లో తగు నిధులు కేటాయించి, సక్రమంగా వినియోగించాలి. 3. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. 4. ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరచి, కేరళ తరహాలో నిత్యావసర వస్తువులను సబ్సిడీ రేట్లకే చౌకడిపోల ద్వారా అందించాలి. 5. ఆహార భద్రతా చట్టాన్ని కచ్చితంగా అమలుచేయాలి. 6. పెట్రోల్, డీజల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలి. 7. రేషన్ కార్డుదారులకు ఈకేవైసి ప్రక్రియ సులభతరం చేసి, సరైన ఏర్పాటుచేయాలి. 8. జనాభా గణన నిర్వహించాలిని డిమాండ్స్ తో కూడిన కరపత్రాన్ని ప్రజలకు అందజేశారు.
జన జీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్న అధిక ధరలను అరికట్టి, పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సి.పి.ఐ.) జాతీయ సమితి పిలుపులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ నుండి 6వ తేదీ వరకు మన రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో సి.పి.ఐ. ప్రజాందోళనలను నిర్వహిస్తోందన్నారు . ఈ ఆందోళనలలో యావన్మంది ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శిలు రమణ, అల్లి పీరా, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, నగర కార్యవర్గ సభ్యులు గదిలింగప్పా, నారాయణస్వామి, సుందరాజు,జమీర్, మున్న, ప్రసాద్, శ్రీనివాస్ , రెహంతుల్లా, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షుడు శ్రీనివాస్,ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యు నాయకులు జానకి, రమాదేవి, పద్మ,పవన్, జాఫర్,ముజీబ్ తదితరులు పాల్గన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img