సోదరులకు రాఖీ కట్టిన ఎమ్మెల్యే పరిటాల సునీత
విశాలాంధ్ర-రాప్తాడు : అని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తన సోదరుడు ధర్మవరపు బాలాజీ, కిరణ్ తోపాటు పలువురికి రాఖీ కట్టారు. కార్యాలయ సిబ్బంది, గన్ మెన్లకు రాఖీ కట్టారు. వారంతా సునీత ఆశీర్వాదం తీసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు అను నిత్యం రక్షణగా ఉండేది వీరేనని ఒక ఎమ్మెల్యేగానే కాకుండా సోదరిగా భావించి ప్రతి క్షణం నా వెంట నడుస్తుంటారన్నారు. రాజకీయాల్లోకి ఇంత ధైర్యంగా నిలబడ్డానంటే ప్రజాభిమానంతో పాటు ఇలాంటి సోదరుల సహకారమేనన్నారు. ప్రతి ఇంట్లో మహిళకు రక్షణగా ఒక సోదరుడు ఉండటం అదృష్టమన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలందరికీ రక్షణగా ఉన్నారని సునీత అన్నారు.