విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గంలోని రామగిరి మండలం, నసనకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, పరిటాల సిద్ధార్థ ఆదేశాల మేరకు గురువారం రామగిరి మాజీ జడ్పీటీసీ రామ్మూర్తి నాయుడు, ముత్యాలంపల్లి రామ్మోహన్ చౌదరి, మండల తెలుగు యువత అధ్యక్షులు లింగా శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో కంటికి 138 మంది పరీక్షించుకోగా అందులో 75 మందికి ఆపరేషన్లు చేయించడానికి బెంగళూరు శంకర్ కంటి ఆసుపత్రికి బస్సులో తీసుకెళ్లారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ దాసరి సుధాకర్, నసనకోట ఎంపీటీసీ శ్రీనివాసులు, ఎస్సీ సెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డి.పోతన్న,
డాక్టర్ గడ్డం ముత్యాలు, గ్రామ కమిటీ అధ్యక్షులు లింగన్న, ముత్యాలంపల్లి డి.ముత్యాలు, ఉమాకాంత, చెంగలరాయుడు, తదితరులు పాల్గొన్నారు.