విశాలాంధ్ర – పూసపాటి రేగ : అక్రమంగా గడ్డవాగులో నిర్మిస్తున్న శాశ్వత భవనాన్ని స్థానిక రెవిన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. స్థానిక తాసిల్దారు టి గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం గోవిందపురం రెవిన్యూ లో కొంతాల చెరువుకి నీరు ప్రవహించే గెడ్డవాగుని గోవిందపురానికి చెందిన భూ స్వామి ఆక్రమించి శాశ్వత నిర్మాణం మొదలుపెట్టడంతో గతంలో ప్రభుత్వ అధికారులు నిర్మాణాన్ని ఆపేశారు. దానితో నిర్మాణ పనులు ఆగిపోయాయి. అయితే ఈ ఆదివారం సెలవు దినంలో మరల పనులు ప్రారంభించి నిర్మాణం చేపట్టడంతో విషయం తెలుసుకున్న మండల సర్వేయర్ గణపతి రావు, గోవిందపురం గ్రామ సర్వేలు, వీఆర్వోల సహాయంతో సోమవారం పనులను నిలిపివేశారు. నిర్మాణం చేపడుతున్న వ్యక్తి సదర అధికారులతో గెడ్డ వాగులో పట్టా ఇచ్చారని రెవెన్యూ అధికారులతో తెలపడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. అదే నిజమైతే గెడ్డ వాగు కూడా పట్టా ఏ విధంగా పుట్టిందో చూడాలి మరి…….