విశాలాంధ – జేఎన్టీయూ ఏ: మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల లో బి.టెక్ రెండవ సంవత్సరము – కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్న బి. మౌనిక రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన రోప్ స్కిప్పింగ్ పోటీలలో ప్రతిభ కనపరిచి మొదటి బహుమతి గోల్డ్ మెడల్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ కర్నూల్ లో నిర్వహించిన ఈ పోటీలలో బి. మౌనిక ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయీ పోటీలకు ఎంపిక అయినట్లు ఆయన అన్నారు. ప్రతిభ కనపరిచిన ఈ విద్యార్థిని ని కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, ఫిసికల్ డైరెక్టర్ డాక్టర్ దామోదరన్, విక్రమ్ అభినందనలు తెలిపారు