ఏఐటీయూసీ డిమాండ్
విశాలాంధ్ర -అనంతపురం : సచివాలయ ఏ ఎన్ ఎం ల సమస్యలు కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురము జిల్లా వ్యాప్తంగా ఉన్న సచివాలయ ఆరోగ్య కార్యదర్శు( ఏఎన్ఎం ) ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం గ్రీవెన్స్ లో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ… ఏఎన్ఎం లు సచివాలయం మరియు హెల్త్ డిపార్ట్మెంట్ రెండింటి పరిధిలో పనిచేస్తున్నారన్నారు,కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సెకరెట్రీలను వారి మాత్రు శాఖలకు బదలాయించింది అన్నారు. కానీ సచివాలయాల్లో పనిచేస్తున్న ఏఎన్ఎం లను హెల్త్ డిపార్టుమెంటు కు కేటాయించలేకపోవడం సరైంది కాదన్నారు. రెండు డిపార్టుమెంటు పరిధుల్లో పనిచేయాలంటే ఏఎన్ఎం లకు చాలా ఇబ్బందిగా మారిందన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ఏఎన్ఎం లను హెల్త్ డిపార్టుమెంటుకు కేటాయించాలన్నారు. ఏఎన్ఎం లకు గ్రేడ్-2 ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్సు ఉద్యోగాల్లో కూడా ఏఎన్ఎం లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూనిఫామ్ అలవెన్సులు సరెండర్ లీవ్స్ వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఏఐటీయూసీ గా దశలవారి ఆందోళనలకు దిగుతామన్నారు,
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్,నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,ఏ ఎన్ ఎం అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రజనీ,నాయకులు విజయ, భారతి,తైరాభాను,పద్మావతి,జయలక్ష్మి,మంజులా,సావిత్రి తదితరులు పాల్గొన్నారు.