విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : మట్టి వినాయకులను పూజించడం వల్ల పర్యావరణం బాగుంటుందని జనసేన నాయకుడు ధనుంజయ పేర్కొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని శుక్రవారం పామిడి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎద్దులపల్లి రోడ్డు అంబేద్కర్ విగ్రహం దగ్గర వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు వేణుగోపాల్, జగదీష్, లాలు స్వామి,రోషన్,జమీర్, శిక్షావలి, ఖాజావలి,శరత్ బాబు,భాస్కర్ గౌడ్, ఆఫ్జల్ అర్జున్, రామాంజనేయులు, పాల్గొన్నారు…