Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

జగన్ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు

కనీసం గ్రామాలకు బ్లీచింగ్ పోడర్ కూడా ఇవ్వలేదు
గ్రామ సభల సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శలు

విశాలాంధ్ర – అనంతపురం : జగన్ పాలనలో గ్రామాలకు నిధులివ్వక కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూశామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. జేఎన్టీయూ సమీపంలోని రూరల్ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించారు. “మన పంచాయితీ-మన సాధికారత” పేరుతో సర్పంచ్ ఉదయ్ ఆధ్వర్యంలో గ్రామ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు టిసి.వరుణ్, జనసేన వీర మహిళ రాయలసీమ అధ్యక్షురాలు పెండ్యాల శ్రీలత, బిజెపి రాష్ట్ర కార్యదర్శి లలిత్ కుమార్ ఇతర కూటమి నాయకులు, స్థానిక సర్పంచ్, ప్రజలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రూరల్ పంచాయతీ పరిధిలోని సమస్యల్ని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సమస్యల గురించి ఎక్కువగా వినతలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ఈ గ్రామ సభలు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ఎందుకు నిర్వహిస్తుందో తెలుసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొదటి నుంచి గ్రామ స్వరాజ్యానికి పెద్ద పీటవేశారన్నారు. అయితే గత ఐదేళ్ల జగన్ పాలనలో పంచాయతీ వ్యవస్థ నాశనం అయిపోయిందన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో గ్రామాలకు బ్లీచింగ్ పౌడర్ కూడా ఇవ్వలేదని, రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకే గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన విధంగా గ్రామీణాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1490 కోట్లు ఈ రెండు నెలల్లోనే విడుదల చేశారన్నారు. గత టీడీపీ పాలనలో 25వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మించారని.. కానీ జగన్ మాత్రం పనులు చేసిన కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకుండా వేధించారన్నారు. గతంలో నారా లోకేష్ పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్నప్పుడు 25లక్షల వీధి దీపాలు వేశారని ఇప్పుడు గ్రామాల్లో చీకట్లు కనిపిస్తున్నాయన్నారు. గ్రామాల్లో ఏ ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకుని వాటిని తీర్చడమే లక్ష్యంగా ఈప్రభుత్వం పని చేస్తోందన్నారు. అనంతపురం రూరల్ గ్రామ పంచాయతీలో రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, తాగునీరు, పింఛన్లు, ఇళ్ల నిర్మాణం వంటివి తమ దృష్టికి వచ్చాయని.. వీటిన్నింటికీ తగిన ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేస్తామన్నారు. అంగన్వాడీ, కమ్యూనిటి హాల్ నిర్మాణాలకు స్థల సేకరణ చేయాలని అధికారులు సూచించారు. అలాగే జలజీవన్ ద్వారా ఇంటింటికీ కొళాయి తీసుకొస్తామన్నారు..
ఈ కార్యక్రమంలో అర్బన్ తహసిల్దార్ హరి కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ జె ఎల్ మురళీధర్, టిడిపి రాష్ట్ర నాయకులు సుధాకర్ నాయుడు, గంగారామ్, అర్బన్ బ్యాంకు డైరక్టర్ కృష్ణకుమార్, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు జయరాం నాయుడు,రాయల్ మురళి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే లక్ష్మీ నరసింహ, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు సరిపూటి రమణ, టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచెపువెంకటేష్, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి, టిఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీ నరసింహులు, టిడిపి సీనియర్ నాయకుడు నారాయణస్వామి యాదవ్, వేంకటేశ్వర రెడ్డి, చేరుకుతోట పవన్ కుమార్, సంబంధిత అధికారులు, టిడిపి నాయకులు కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img