సెక్స్ వర్కర్స్ కు అవగాహన సదస్సు
విశాలాంధ్ర -అనంతపురం : సమాజంలో సెక్స్ వర్కర్లకు కూడా సమాన హక్కులు ప్రాథమిక హక్కులు ఉన్నాయని, ప్రతి చట్టాలు వారికి వర్తిస్తాయని వక్తలు పేర్కొన్నారు. నగరంలోని రాజహంస డీలక్స్ కన్వెన్షన్ హాల్ లో జిల్లాలోని సెక్స్ వర్కర్లకు సంగ్రామ్ సంస్థ, నేషనల్ నెట్వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్, సింధూర ఆర్గనైజేషన్, ఝాన్సీ లక్ష్మి కమ్యూనిటీ ఆర్గనైజేషన్ లు సంయుక్తంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ డీఎల్ఎస్ఏ కార్యదర్శి శివ ప్రసాద్ యాదవ్ , న్యాయవాదులు హరికృష్ణ పద్మజ, జిల్లా వైద్యాధికారి భాస్కర్,, సంస్థల పీడీలు నాగమణి, పుష్ప, సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఎల్ ఎస్ ఏ , సెక్రటరీ శివ ప్రసాద్ యాదవ్ , మాట్లాడుతూ బుద్దదేవ్ కర్మాస్కర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పశ్చిమ బెంగాల్ కేసు నందు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులోని అంశాలపైన అవగాహన కలిగించారు. పోలీసులు సెక్స్ వర్కర్లకు సముచిత గౌరవం వేయాలని, ఒక స్త్రీగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోవాలన్నారు. స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సెక్స్ వర్కర్ అనేది వివక్షతకు లోపం కాదు అన్నారు. అడ్వకేట్ పద్మజ ,హరి కృష్ణ, మాట్లాడుతూ జీవనోపాధికి కొందరు స్వచ్ఛం దంగా ఈ వృత్తిని ఎన్నుకున్నారని, అటువంటి వారిని బలవంతంగా ప్రేరేపిం చడానికి వీలులేదని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉన్నదని అన్నారు. వారికి ఏవిధమైన సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సం స్థను సంప్రదిస్తే ఉచిత న్యాయ సహాయం అందిస్తుందని తెలియజేశారు. నాగమణి మాట్లాడుతూ సమస్త స్థాపించినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా సెక్స్ వర్కర్లకు ట్రాంజెండర్ లకు అండగా ఉన్నామన్నారు. సంస్థలో ప్రస్తుతం 80 మందికి ఉపాధి కల్పించడం జరిగింది అన్నారు. పుష్ప మాట్లాడుతూ సమస్త ద్వారా కరోనా సమయంలో ఎంతోమందికి ముడి సరుకులను విచారణ చేయడం జరిగిందన్నారు. కమ్యూనిటీలో ఉన్నవారికి ఆధార్ కార్డు ఇతర వాటిని సహాయం చేస్తూ వారికి సంస్థ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో విష్ణుతేజ, వెంకటరమణ, పీడీలు కుళ్లాయప్ప, క్రిష్టప్ప, తదితరులు పాల్గొన్నారు.