రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు విద్యార్థి సంఘం నేతలు వినతి
విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ నియామకాలను రద్దు చేయాలని, జీవో నెంబర్ 203 ను సమగ్రంగా అమలు చేయాలని బుధవారం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమణయ్య, టిఎన్ఎస్ఎఫ్ ఎస్కేయూ అధ్యక్షుడు సురేంద్ర వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాజీ వీసీ రామకృష్ణారెడ్డి, మాజీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె .హేమచంద్ర రెడ్డి నిధులను, విధులను దుర్వినియోగం చేసిన ఘనత వారికే దక్కుతుందన్నారు. మాజీ వీసీ పేరుతో ధ్యాన మందిరాన్ని నెలకొల్పడం దేనికి సంకేతం అర్థం కాని పరిస్థితి నెలకొన్నది అన్నారు. అక్రమ నియామకాలపై హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేకతను పరిష్కరించి నియామకాలు చేపట్టాలని కోరారు.