విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవపురం వద్ద గల సత్యసాయి పంప్ హౌస్ వద్ద సత్యసాయి తాగునీటి కార్మికులు 19వ రోజు సమ్మెలో భాగంగా తమ నిరసనగా గుజ్జులు తీస్తూ నిరసనను తెలియజేశారు. అనంతరం తాగునీటి కార్మికులు మాట్లాడుతూ రోజులు గడుస్తున్న యాజమాన్యం గాని ప్రభుత్వం గానీ స్పందించకపోవడం దారుణమని, మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని వారు బాధని వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు రావడం లేదని 11 నెలల పిఎఫ్ కూడా అందించడం లేదని ఈఎస్ఐ సౌకర్యం కల్పించడం లేదని అధికారుల కు జీతాల సమస్యను తెలిపిన కూడా పరిష్కరించకపోవడం ఏమనాలో మాకు అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కుటుంబ పోషణ పిల్లల చదువులు ప్రశ్నార్థకమయిందని, ఎలా జీవించాలో అయోమయ పరిస్థితిలో ఉన్నామని వారు బాధని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించి, మా జీతాలను వెంటనే చెల్లించేలా తగు చర్యలను వేగవంతం గా చేపట్టాలని తెలిపారు.