భాజపా బోగస్ ప్రకటనలు మానుకోవాలి…
మున్సిపల్ కార్పొరేషన్ స్థలాలను కబ్జా నుంచి కాపాడండి…
సిపిఐ నగర్ కార్యదర్శి ఎన్. శ్రీరాములు
విశాలాంధ్ర-అనంతపురం : పాత ఊరు రాణి నగర్ లో నివాసముంటున్న వడ్డే ఉప్పు శ్రీనాథ్ కు సిపిఐ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం సిపిఐ ప్రధాన కార్యాలయంలో నగర సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆదివారం రాణి నగర్ లో వడ్డే ఉప్పు శ్రీనాథ్ ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరినట్లు వచ్చినటువంటి వార్తలు అవాస్తవమ్మన్నారు. సిపిఐ పార్టీ కార్యకర్తలు ఎవరు రాణి నగర్ నుంచి బిజెపి పార్టీలో చేరలేదన్నారు. వడ్డే ఉప్పు శ్రీనాథ్ తండ్రి వారి సోదరుడు సిపిఐ పార్టీల్లో సభ్యత్వం ఉందని వడ్డే ఉప్పు శ్రీనాథ్ కు పార్టీ సభ్యత్వం కూడా లేదన్నారు. బయట వ్యక్తులను తీసుకొని వచ్చి బిజెపి పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సంధి రెడ్డి శ్రీనివాసులు సిపీఐ పార్టీ గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. రాణి నగర్ పదో డివిజన్ స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి ఐదుకల్లు సదాశివ సతీమణి అయినటువంటి ఐదు కల్లు రాజమ్మ పేరు మీద గత 50 సంవత్సరాల కిందటే కాలనీ వెలిసింది అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేయకుండా బ్రిటిష్ పాలకుల పాదాలకు కాళ్లు నొక్కుతూ వెలసిన ఆర్ఎస్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. సిపిఐ పార్టీ విమర్శించే స్థాయి కాదన్నారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సెంట్రల్ పార్క్, ఆర్టీసీ , ఖాజా నగర్, శ్రీనివాస నగర్, పలు ప్రాంతాలలో కార్పొరేషన్ సంబంధించి కోట్లాది రూపాయలు విలువగల భూములు కబ్జాబ్ గురి అయిన అన్నారు. గతంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మూర్తి ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్ వద్దన్న ఒకటిన్నర ఎకరా భూమిని సర్వే చేయించడం జరిగిందన్నారు. ఇంతవరకు సర్వే వివరాలను బయటికి ప్రకటించలేదన్నారు. శ్రీనగర్ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించి 353 సర్వే నెంబర్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు కబ్జా చేశాడు అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర మున్సిపల్ మంత్రి, ప్రజా ప్రతినిధులు దృష్టి తీసుకుపోవడం జరుగుతుందన్నారు. వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోతే స్థలాలను పేద ప్రజలకు అందే విధంగా సిపిఐ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఈ సమావేశంలో నగర సహాయ కార్యదర్శులు రమణయ్య, అలిపిర, ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు శ్రీనివాసులు, రాణి నగర్ డివిజన్ కార్యదర్శి బీరువాల సూరి, తదితరులు పాల్గొన్నారు.