విశాలాంధ్ర-రాప్తాడు : పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులను మెరికల్లాంటి క్రీడాకారులుగా దిద్దాలని డీఈఓ వరలక్ష్మి సూచించారు. రాప్తాడు నియోజకవర్గం క్రీడల స్కూల్ కాంప్లెక్స్ సమావేశం మంగళవారం రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో జరిగింది. రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. డీఈఓ వరలక్ష్మి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని సందర్శించి పీడలకు సంబంధించిన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఉదయం నుండి సాయంత్రం వరకు క్రీడలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. సమావేశాన్ని స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ సాంబశివుడు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ ఎన్. కేశవమూర్తి, బి.రాజశేఖర్ రెడ్డి, సిరాజ్, ముస్తఫా, సునీత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.