ఉరవకొండ కార్యదర్శి గౌస్ సాహెబ్
విశాలాంధ్ర,ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలో శనివారం అన్ని సచివాలయ పరిధిలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్ పంపిణీ కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయడం జరిగిందని ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాలతో గ్రామపంచాయతీ మరియు సచివాలయ సిబ్బంది సమన్వయంతో వర్షం పడుతున్నప్పటికీ కూడా వేగవంతంగా పింఛను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పింఛన్లను 100% విజయవంతంగా పంపిణీ చేసిన సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.