ప్రభుత్వమే టమోటాలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి
…. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున
జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డికి వినతులు
విశాలాంధ్ర -అనంతపురం : అనంత జిల్లా టమోటా రైతులను ఆదుకోవాలని , ప్రభుత్వమే టమోటాలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున శనివారం కలెక్టరేట్లోని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….
అనంత జిల్లా రైతులు అధిక సంఖ్యలో లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి టమోట పంటలను సాగు చేస్తున్నారన్నారు. పండిన పంటలను కక్కలపల్లి టమోట మార్కెట్కు తీసుకొని వస్తే తీనుగాని వస్తే ఇక్కడ మండివారు , వ్యాపారులు ఇద్దరు కుమ్ముక్తి. జాక్ పాట్ పేరు తో 100 బాక్సులకు 4 బాక్సలు తీయడం జరుగుతుందన్నారు , ఎక్కడలేని ఎక్కడ లేని విధంగా ఈ మార్కెట్ లో కమీషన్ కూడా 10%. మరియు బాక్సీలపైన హములీ పేరుతో అధిక దబ్బులు వసులు చేయడం జరుగుతుందన్నారు. అసలే గిట్టు బాటు ధరలు, లేని పరిస్థితులతో ఈరకంగా రైతులపై వివిధి పేర్లత వసూళ్లు చేయడం వల్ల తీవ్రంగా తీవుంగా నష్ట పోతున్నారని పేర్కొన్నారు. మదనపల్లి, పలమనేరు, మార్కెట్లో జాక్ పాట్ గాని బాక్సులపైన మరియు హమాలీల కూలీలు కూడా మండివారే కూలీలు భరిస్తున్నారన్నారు . జాక్పాట్ పేరుతో రైతులను బప్పించి వారి అనుమతితో బాక్స్ కు 2 లేదా 3 టమోటా కాయలు మాత్రమే తీసుకుంటున్నారన్నారు . కాని కక్కులపల్లి మార్కెట్ లో 100 బాక్సులకు నాలుగు బాక్సులు జాక్పాట్ పేరుతో ఈ విధంగా దోపిడీ చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విధానాన్ని రద్దుపరిచి జాక్పాట్ ను రద్దు చేస్తూ రైతుల కమిషన్ కూడా 5 లేదా 7 శాతం మాత్రమే తీసుకొని బాక్స్ హమాలీలకు, కూలీలకు మండి వారితోనే కూలి ఇప్పించి టమోటా రైతులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వమే టమోటాలు కొనుగోలు చేసి టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతి పత్రం ద్వారా కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ, పి. ప్రతాప్,జి. దుర్గాప్రసాద్, బి. నగేష్ తదితరులు పాల్గొన్నారు.