సర్వజన ఆసుపత్రి సూపర్డెంట్ కు వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ నాయకులు
విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చిన ప్రజలకు సరైన సమయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బంది గురి అవుతున్నారని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సరోజెన్ ఆస్పత్రి సూపర్డెంట్ కే ఎస్ ఎస్ వెంకటేశ్వరరావుకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ… అనంత కరువు జిల్లా కావడంతో ప్రజలు తమ ఆరోగ్యం సరిగా లేనప్పుడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి రావడం జరుగుతుందన్నారు. అంత దూరం నుంచి వస్తున్న రోగులకు సరైన సమయం లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు లేకపోవడంతో మెరుగైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అన్నారు. కనీసం డ్యూటీ నిర్వహిస్తున్న డాక్టర్ల వివరాలు కానీ ఫోన్ నెంబర్లు అక్కడ లేకపోవడం వల్ల ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది అన్నారు. డ్యూటీ నిర్వహిస్తున్న వైద్యులు ఆ సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారని దీనిపై దృష్టి పెట్టాలని కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై సర్వజన ఆస్పత్రి సూపర్డెంట్ స్పందిస్తూ రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్, సహాయ కార్యదర్శి శ్రీనాథ్, జిల్లా నాయకులు దేవేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.