విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా): పట్టణంలోని యల్లనూరు రోడ్డు నుండి సబ్ రిజిస్టర్ కార్యాలయం వరకు ఏపీ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు సభ్యులు ఆర్. కమ్మగిరి స్వామి ఆధ్వర్యంలో సోమవారం అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న స్టాంప్ రైటర్ల పై చర్యలు తీసుకోవాలని ర్యాలీ నిర్వహించి, సబ్ రిజిస్టర్ శివ నారాయణ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టాప్ రైటర్లు దళితులకు చెందిన డి-పట్టా స్థలాలను చూపడాయికం చూపించి, మూడు సంవత్సరాల తర్వాత రిజిస్టర్ అధికారులకు లంచాలు ఇచ్చి అగ్ర కులస్తులకు రిజిస్టర్ చేస్తున్నారన్నారు. అలాగే లింకు పత్రాలు లేకుండా రిజిస్టర్లు చేస్తున్నారు. తాడిపత్రి రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ లపై హైకోర్టుకు, మానవ హక్కుల కమిషన్కు తాము ఫిర్యాదు చేయడానికి అక్రమ రిజిస్ట్రేషన్ల జాబితా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ మండలి సభ్యులు డి.చంద్రశేఖర్, హెచ్.నాగన్న, రామాంజనేయులు, కొండి గుర్రప్ప, గాండ్లపాడు రామంజి పాల్గొన్నారు.