జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
విశాలాంధ్ర – అనంతపురం : ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక రాణి నగర్ లోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లోని కళ్యాణ మండపం నందు విశ్వ కర్మ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ పాల్గొని విశ్వ కర్మ చిత్రపటానికి పూలమాలలు , జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,.. పీఎం విశ్వకర్మ పథకం ను సద్వినియోగం చేసుకోవాలని విశ్వకర్మ ప్రోగ్రాంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్టేట్ ప్రోగ్రామ్ గా అనంతపురం జిల్లాలోనే కాకుండా ప్రతి ఒక్క జిల్లాలో ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం చాలా గొప్పగా విజయవాడలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి పీఎం విశ్వకర్మ అని ఏర్పాటు చేయడం జరిగిందని, మన భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో, వివిధ రకాల జాతులు , వివిధ రకాల కులాల వారు ఉన్నారని, వివిధ రకాల పనులు చేసే వారు ఉన్నారని వాటిలో ఆంధ్రప్రదేశ్లో పి ఎం విశ్వ కర్మ యోజన పథకం కింద 18 రకాలైన చేతి వృత్తుల వారికి గుర్తించడం జరిగిందన్నారు. వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 17 న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఈ పథకం కింద ఎంపికై ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొదటి విడతలో ఋణ సౌకర్యం అందించడం జరుగుతుందన్నారు. ఈ పథకం ను సరైన రీతిలో అర్హులందరూ సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని తెలిపారు. శిక్షణ పొందే కాలంలో రోజుకు 500 రూపాయలు చొప్పున వీరికి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ పూర్తి తరువాత వారు సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా ఉండాలని వారు నేర్చుకున్న విద్యను వారి ఉపాధిగా చేసుకునే విధంగా చూడాలన్నారు. ఈ శిక్షణ పొందిన వారికి టూల్ కిట్, స్టైఫండ్, లక్ష రూపాయల ఋణ సౌకర్యం తో పాటు అధునాతన పనిముట్లు, ఎలా ఉపయోగించి తమ నైపుణ్యాన్ని మెరుగు పరచుకోవాలన్నది తెలియజేయడం జరుగుతుందన్నారు. దీనితో పాటు, కేంద్ర ప్రభుత్వం జారీ చేయు ధృవ పత్రము మరియు గుర్తింపు కార్డు అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఒక పనిని గురువుల నుండి శిష్యులకు కానీ, వంశ పారంపర్యంగా కుటుంబ సభ్యులకు, మరొకరికి నేర్పించే విధంగా కానీ లేదంటే గ్రామాల్లో మరొకరికి నేర్పే విధంగా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు, బీసీ వెల్ఫేర్ డిడి కుష్బూ కొఠారి, అనంతపురం అర్బన్ తాసిల్దార్ హరిబాబు , విశ్వకుల వివిధ కుల పెద్దలు, విశ్వకుల ఆలయ కమిటీ సభ్యులు , విద్యార్థులు, ప్రజలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.