— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర -అనంతపురం : దేశ ప్రజల కోసం నిరంతరం శ్రమించిన యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా ఎస్పీ పి.జగదీష్ పేర్కొన్నారు. దివంగత ఆంధ్రరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధులైన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి పురస్కరించుకుని శుక్రవారం ఆయన జిల్లా పోలీసుకార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడారు. ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23 న సుబ్బమ్మ, గోపాలకృష్ణయ్యలకు జన్మించారన్నారు. అద్దంకి, వినోదరాయుడి పాలెం, నాయుడుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరాలలో ప్రకాశం బాల్యం మరియు ప్రాథమిక విద్య కొనసాగిందని గుర్తు చేశారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో సవాళ్లను అధిగమించి ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడని కొనియాడారు. 1940, 50 దశకంలోని ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరన్నారు. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణాయక పాత్ర పోషించారన్నారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీకెదురుగా గుండెనుంచి ఆంధ్రకేసరిగా చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి…అనంతపురం, కళ్యాణదుర్గం డీఎస్పీలు టి.వి.వి ప్రతాప్ , రవికుమార్, సి.ఐ లు ధరణీకిశోర్, కనుమూరి సాయినాథ్, శ్రీకాంత్, ప్రతాప్ రెడ్డి, ఆర్ ఐ లు రాముడు, మధు, డిపిఓ సూపరింటెండెంట్లు ప్రసాద్, సావిత్రమ్మ, జిల్లా పోలీస్ మినిస్టీరియల్ అసోసియేషన్ అధ్యక్షులు గోపి, రమణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ ఎస్ ఐ జాఫర్ , సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్, లక్ష్మినారాయణ, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.