జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి.
విశాలాంధ్ర -ధర్మవరం; కలకత్తాలోని ట్రైన్ డాక్టర్ ను హత్య చేసి కిరాతకంగా చంపిన నిందితుడికి కఠినంగా శిక్షను విధించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నుండి కాలేజీ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. అనంతరం చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాలు ఇచ్చి ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ ను అతి కిరాతకంగా చంపడం నిజంగా బాధాకరమని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వారు తెలిపారు. దేశస్థాయిలో ఇలాంటి ఘటన మున్ముందు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తెలిపారు. అత్యాచారం, మానసికంగా కృంగదీయుట, మహిళలు అని చూడకుండా అనేక హింసలు పెట్టు వారందరికి కూడా వెలువెంటనే శిక్షపడే విధంగా ప్రభుత్వాలు చొరవ చూపాలని తెలిపారు. డాక్టర్ మృతి చాలా బాధాకరమని, ఆ కుటుంబానికి తాము సంతాపం తెలుపుతున్నామని తెలిపారు. నేడు పురుషులతో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో ఉంటున్నారని, అలాంటప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం నిజంగా దురదృష్టకరమని తెలిపారు. ఇటువంటి విషయాలను కేంద్రంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలియజేసి, ఆ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బెస్త శ్రీనివాసులు, శ్యామ్ కుమార్ అధిక సంఖ్యలో మహిళలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.