Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 13, 2024
Friday, September 13, 2024

మాజీ సీఎం బుద్ధదేవ్ మరణం బెంగాల్ సాహిత్యం సంస్కృతి కి తీరని లోటు

సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం : మాజీ సీఎం బుద్ధదేవ్ మరణం బెంగాల్ సాహిత్య , సంస్కృతికి తీ రని లోటు అని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కమ్యూనిస్టు దిగ్గజ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత దిగ్బ్రాంతికరం అన్నారు. కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బస్సు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2011 వరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పని చేశారన్నారు. కోల్కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ పూర్వ విద్యార్థి ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టి ఉపాధ్యాయుడుగా పనిచేశారు. 1977లో తొలిసారి కాశీపూర్ బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య 1944 మార్చి 1న ఉత్తర కోల్కతాలో జన్మించడం జరిగిందన్నారు. 1966 లో సిపిఎం ప్రాథమిక సభ్యుడు అయ్యాడన్నారు. కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య రచయితగా తన పద్యాలు గద్యాలు అనువాదాలతో బెంగాల్ సాహిత్యం సంస్కృతి చరిత్రలను సుసంపన్నం చేశారని పేర్కొన్నారు. ప్రఖ్యాత మేధావిగాను గౌరవించబడ్డారు బెంగాల్ సాహిత్య సాంస్కృతి రంగానికి ఆయన లేని లోటును పూడ్చలేనిది అన్నారు. కామ్రేడ్ బుద్ధదేవ బట్టాచార్య కుటుంబ సభ్యులకు సిపిఐ ప్రగాఢ సానుభూతిని, వారికి సంతాపాన్ని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img